Header Banner

40 ఏళ్లు వస్తే ఈ టెస్టులు తప్పనిసరి! లేదంటే మాటర్ చాలా సీరియస్!

  Fri May 23, 2025 10:43        Health

40 ఏళ్లు దాటిన పురుషులు క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు ఏవో తప్పక తెలుసుకోండి.


భారతీయుల్లో చాలా మంది రెగ్యూలర్‌గా మెడికల్ టెస్టులు చేయించుకోరు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు, పురుషులకు హెల్త్ చెకప్‌లు తప్పనిసరిగా చేయించుకోవాలి. గుండె జబ్బులు, డయాబెటిస్, ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.


యుక్త వయస్సు దాటిపోవడం అంటే మగవాళ్లకు నరకంతో సమానం. వయసు పైబడుతున్న కొద్ది పురుషులు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి హెల్త్ చెకప్స్, టెస్టులు చేయించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

హటాత్తుగా చనిపోతున్న మగవాళ్ల సంఖ్య పెరగడానికి గుండె జబ్బులే ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి. ప్రతీ ఏడాది 33 వేల నుంచి 42 వేల మంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు.


 ఇది కూడా చదవండి:  ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!



ఈ క్యాన్సర్‌ను గుర్తించేందుకు పీఎస్ఏ టెస్టు తరచూ చేయించుకుంటూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో ప్రొస్టేట్ గ్రంధీలో ఇన్‌ఫ్లమేషన్, వాపు వంటి వాటిని ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్ రిస్క్ తగ్గించుకునేందుకు లిపిడ్ ప్రొఫైల్, షుగర్ టెస్టులు తప్పనిసరి. ఎల్‌డీఎల్‌, హెచ్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను బట్టి ఒంట్లో కొవ్వు ఎంత ఉందో అంచనా వేస్తారు. హెచ్‌బీఏ1సీతో షుగర్ లెవెల్స్‌పై అవగాహన వస్తుంది.

కిడ్నీ, లివర్ ఫంక్షన్ టెస్టులు కూడా చేయించుకుంటూ ఉంటే ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచొచ్చు. మద్యపానం, డయాబెటిస్ ఉన్న వారికి ఈ పరీక్షలు తప్పనిసరి.


కొలాన్, అబ్డామినల్ స్క్రీనింగ్స్‌తో ఉదర సంబంధిత సమస్యలు, కీలక అవయవాలకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. 50 ఏళ్లు పైబడిన పురుషులు తప్పనిసరిగా కొలొనోస్కోపీ చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.


బోన్ డెన్సిటీ టెస్టులను క్రమం తప్పకుండా చేయించుకుంటే ఓస్టియోపోరోసిస్ వ్యాధి రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మహిళలు ఈ పరీక్ష చేయించుకోవడం మరీ ముఖ్యం. ఈసీజీ పరీక్షలతో గుండె జబ్బు ముప్పు తగ్గించుకోవచ్చు.

టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ పరీక్షలు చేయించుకుంటే వయసుతో పాటు వచ్చే హార్మోన్‌లపై ఓ కన్నేసి ఉంచొచ్చు. జన్యుపరమైన పరీక్షల ద్వారా ప్రాస్ట్రేట్, బ్రెస్ట్, ఓవేరియన్ క్యాన్సర్ ముప్పు ఎంత ఉందో తెలుసుకుని ముందు జాగ్రత్త చర్యలు పాటించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఎంట్రీ ఇచ్చిన కరోనా.. తొలి కేసు నమోదు! ఎక్కడంటే!

 

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!

 

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు..! ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్!

 

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!



ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #HealthAfter40 #MustDoTests #HealthCheckup #PreventiveCare #StayHealthy #HealthAwareness